'తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోండి'
NDL: సంజామల మండలం గిద్దలూరు గ్రామపంచాయతీలో ఉన్న మంగపల్లె, రామభద్రుని పల్లె గ్రామాలలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మండల టీడీపీ నాయకుడు బీవీ. ప్రతాపరెడ్డి గురువారం అన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను బీవీ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. మొక్కజొన్న, మిరప, మినుము పంటలు బాగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు.