టిడ్కో గృహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్‌లో 1008 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో MLA డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పత్రాలు అందజేసి ఇంటి తాళాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.