అక్రమణల నుంచి చెరువులకు విముక్తి
HYD: ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులను అక్రమణల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం HMDA పూర్తి నీటి నిల్వ స్థాయి (FTL) నిర్ధారిస్తూ ప్రాథమిక, శాశ్వత నోటిఫికేషన్ల జారీకి 222 చెరువుల వివరాలను హైడ్రాకు పంపింది. హైడ్రా చొరవ చూపితే.. వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు.