'మెరుగైన విద్యావ్యవస్థకు ప్రభుత్వం కృషి చేస్తోంది'
AP: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలోని రావినూతలలో రూ.1.3 కోట్లతో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ప్రజలకు అంకితం చేశారు. రూ.20 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాలును కూడా ప్రారంభించారు. విద్యార్థులకు 150 సైకిళ్లు పంపిణీ చేశారు.