మహిళ, కుమార్తె ఆచూకీ కనిపెట్టిన పోలీసులు
VSP: P.M.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల వలన ఒక మహిళ తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మహిళ కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు P.M.పాలెం పోలీసులు విస్తృతంగా గాలించి గురువారం వారి ఆచూకీ కనుగొన్నారు. మహిళ, తన కుమార్తెను వారి కుటుంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించారు.