కంభంలో సత్యమ్మకు ప్రత్యేక పూజలు
ప్రకాశం: కంభం పట్టణంలోని శివారులో వెలసిన శ్రీ కోటా సత్యమాంబా దేవి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యమ్మ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల నుంచి భారీగా భక్తులు ఆలయానికి చేరుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో తీర్థప్రసాదాలను స్వీకరించారు.