FLASH: నారపల్లిలో భారీ ట్రాఫిక్ జామ్..!

మేడ్చల్: జోడిమెట్ల నుంచి బోడుప్పల్ వెళ్లే మార్గమధ్యమంలో నారపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నారపల్లి ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న వరంగల్ హైవేపై రోడ్డు గుంతలమయంగా మారటం, దీనికి తోడుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడినట్లు అక్కడ వాహనదారులు తెలిపారు. వాహనాలు రోడ్డుపై మెల్లగా ముందుకు కదులుతున్నాయి.