రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

ASR: చింతపల్లి మండలంలోని గడ్డిబంద ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. కిల్లంకోట పంచాయతీ కురిడేలుకు చెందిన 12 మంది గిరిజనులు నేరేడుపల్లిలో జరుగుతున్న పెళ్లికి జీపులో బయలుదేరారు. ఈ క్రమంలో జీప్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ కాసులమ్మ (38) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.