VIDEO: మంత్రికి తప్పిన ప్రమాదం

VZM: విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం MSME పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా కూటమి నేతలకు ప్రమాదం తప్పింది. సమావేశం అనంతరం సభావేదిక దిగుతుండగా స్టేజ్ ఒరిగిపోయింది. కార్యకర్తలు ఒక్కసారిగా వేదిక మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే పక్కన ఉన్న సిబ్బంది అప్రమత్తమై మంత్రితో పాటు గంటాను పైకి లేపారు.