రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
CTR: రొంపిచర్ల మండలం AP మోడల్ స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొని శుభారాణి(34) గాయపడినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ చెప్పారు. యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్న ఈమె పీలేరు నుంచి స్కూటీపై వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. చికిత్స నిమిత్తం మహిళను కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.