'రైతన్నలకు యూరియా అందించడం లేదు'

ATP: రైతన్నలకు కనీసం ఎరువులు సక్రమంగా పంపిణీ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని CPI ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం పట్టణంలో ఏపీ రైతు సంఘం నాయకులతో కలిసి మీడియాకి ఓ ప్రకటన విడుదల చేశారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సొసైటీలలో అధికారులకు అనుకూలమైన వారికి మాత్రమే యూరియా అందిస్తున్నారని ఆగ్రహించారు.