VIDEO: 'నల్లవాగు ప్రాజెక్టు పంట కాలువల పనులు పూర్తి చేయిస్తాం'

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలోని లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ పనులు జరుగుతున్నాయని, వాటిని పూర్తి చేయిస్తామని తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించనున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఇరిగేషన్ ఈఈ సుందర్ ఉన్నారు.