సెన్సస్‌ అవగాహనకు 5కే రన్‌

సెన్సస్‌ అవగాహనకు 5కే రన్‌

బాపట్లలో సెన్సస్‌-2027పై అవగాహన కోసం ఈనెల 26న 5కే రన్‌ నిర్వహించనున్నారు. దీనిపై DRO గంగాధర్ గౌడ్ బుధవారం ఏర్పాట్లపై సమీక్షించారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన యువత, విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొనాలని సూచించారు.