బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉంది: సహస్ర తండ్రి

TG: కూకట్ పల్లిలో హత్యకు గురైన సహస్ర అనే బాలిక తండ్రి కృష్ణా సంచలన ఆరోపణలు చేశాడు. తన ఇంట్లోకి బాలుడు క్రికెట్ బ్యాట్ కోసం కాదని.. డబ్బు కోసమే వచ్చాడని తెలిపాడు. తన కూతురు హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉందన్నాడు. తనకు న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుంకుంటానని హెచ్చరించాడు. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు.