పేలిన అగ్నిపర్వతం.. 4.4 కి.మీ ఎత్తు వరకు బూడిద

పేలిన అగ్నిపర్వతం.. 4.4 కి.మీ ఎత్తు వరకు బూడిద

జపాన్‌ క్యుషులో అగ్నిపర్వతం పేలింది. ఈ పర్వతంలో మూడు పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు.  ఫలితంగా లావా, బయటకు రావడంతో ఆకాశంలో 4.4 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఏర్పడిందని వెల్లడించారు. గత 13 నెలల్లో బూడిత ఇంత ఎత్తుకు చేరటం ఇదే తొలిసారని విశ్లేషకులు చెప్పారు. బూడిద నేపథ్యంలో 30 విమానాలను రద్దు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు మాస్కులు ధరించాలని కోరారు.