వరుసగా ట్రాన్స్‌ఫార్మర్ల చోరిలు

వరుసగా ట్రాన్స్‌ఫార్మర్ల చోరిలు

SRD: కోహీర్ మండలంలోని మద్రి గ్రామ శివారులో ట్రాన్స్‌ఫార్మర్ల చోరిలు కలకలం రేపుతున్నాయి. గత నెల 27న రాత్రి దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని రాగి తీగలు, ఆయిల్‌ను దోచుకెళ్లారు. అనంతరం ఈ నెల 2వ తేదీ రాత్రి మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఎత్తుకెళ్లడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు.