VIDEO: అదిగో చిరుత..! నిజమెంత..?
BHNG: రాచకొండ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తొందన్న ప్రచారంతో స్థానికుల్లో భయం నెలకొంది. చౌటుప్పల్ మండలంలోని దేవులమ్మ నాగారం శివారులో చిరుత సంచారం కనిపించినట్లు కొందరు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు చిరుత జాడ కోసం శోధన ప్రారంభించారు. ఇది చిరుతనా లేక హైనానా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.