గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ELR: రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో లైన్ గోపాలపురం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. హైవే సేఫ్టీ సిబ్బంది మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.