భూకేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

GNTR: అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. మంగళవారం సచివాలయంలో మంత్రి నారాయణ ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర పాల్గొనగా, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్ జూమ్ ద్వారా చర్చలో పాల్గొన్నారు. గతంలో భూములు పొందిన సంస్థల కేటాయింపులపై మార్పులు, రద్దులు, కొత్తగా కేటాయింపులపై చర్చ సాగింది.