VIDEO: 'ఇంధనం పొదుపు చేద్దాం భావితరాలకు వెలుగునిద్దాం'
ప్రకాశం: మార్కాపురం డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇంధనం పొదుపు చేద్దాం భావితరాలకు వెలుగునిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విద్యుత్ పొదుపు చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.