ఇరాన్ మా సాయం కోరలేదు: రష్యా

ఇరాన్ మా సాయం కోరలేదు: రష్యా

ఇజ్రాయెల్, అమెరికాలతో వీరోచితంగా ఇరాన్ పోరాడుతున్నప్పటికీ తమ సైనిక సాయం అడగలేదని రష్యా ప్రకటించింది. సాయం కోసం ఇప్పటివరకు ఇరాన్ నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పింది. ఇరాన్‌తో తమ మితృత్వం ఎప్పటిలాగానే కొనసాగుతుందని తెలిపింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. అందులో సైనిక సాయం అంశం లేదని స్పష్టం చేసింది.