చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడిపై దాడి!

చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడిపై దాడి!

RR: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం ఇంట్లో ఉన్న సమయంలో తనపై అటాక్ చేశారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరగా నిరాకరించడంతో తనతో పాటు కుమారుడిపై దాడి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది.