ప్రభాస్ రూ.50 కోట్లు తిరిగి ఇచ్చేశారు: నిర్మాత

స్టార్ హీరో ప్రభాస్‌పై తమిళ నిర్మాత ఒకరు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ మారాయి. 'రాధేశ్యామ్' మూవీ ఆడకపోయేసరికి ప్రభాస్ తను తీసుకున్న రూ.100 కోట్ల రెమ్యూనరేషన్‌లో తమకు రూ.50 కోట్లు తిరిగి ఇచ్చేశారని తెలిపారు. ఈ మొత్తాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వమని కోరినట్లు పేర్కొన్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.