గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

NZB: జిల్లాలో మరో చిరుత మృతి చెందింది. జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి పై చిరుత రోడ్డు ప్రమాదానికి గురైంది. సోమవారం సాయంత్రం తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ప్రాంతాన్ని ఎస్సై మాలిక్ రహమాన్ సందర్శించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.