VIDEO: 'ఇసుక లేక ఇబ్బందులు పడుతున్నాం'
SRCL: ఇసుక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆరోపించారు. సిరిసిల్ల పరిధిలోని రగుడులో గురువారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వారు మాట్లాడారు.. కేవలం మాకు 10 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. 10 ఇసుక ట్రాక్టర్ ట్రిప్పులు మాకు సరిపోవడం లేదన్నారు. అధికారులు మాకు ఇసుక దొరికేలా చూడాలన్నారు.