'విద్యుత్‌ను సమర్థవంతంగా జాగ్రత్తగా వినియోగించుకోవాలి'
JGL: విద్యుత్‌ను సమర్థవంతంగా జాగ్రత్తగా వినియోగించుకోవాలని వెల్గటూర్ మండల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ సూచించారు. వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు “పొలం బాట" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌కు సంబంధించి ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే రైతులు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.