తెనాలిలో గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన
GNTR: తెనాలి తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని, నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏల వారసులను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ అమలు చేయడంతో పాటు అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.