'ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయాలి'

'ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయాలి'

MNCL: ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయాలని పీఆర్టీయూ లక్షెట్టిపేట మండల అధ్యక్ష, కార్యదర్శులు జె.తిరుపతి, బండ రవీందర్ కోరారు. బుధవారం వారు లక్షెట్టిపేట ఎంఈవో శైలజను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక ఆర్థిక ఉపాధి, కుల సర్వేలో చాలా మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు.