'మురళీ నాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది'

కోనసీమ: శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో వీరమరణం పొందిన సంఘటనపై MLC తోట త్రిమూర్తులు శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన నాయక్ ధైర్యం, త్యాగాన్ని కొనియాడారు. ఈలాంటి వీరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.