మూసీలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు

HYD: మూసీ ఉద్ధృతి పెరగడంతో చైతన్యపురి పరిధిలోని మూసీ నదిలో ఉన్న శివాలయం వద్ద ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. వారిద్దని బయటకు తీసుకువచ్చేందుకు హైడ్రా, GHMC బృందాలు రంగంలోకి దిగారు. దీంతో చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా, సరూర్‌నగర్ DC సుజాత పరిస్థితిని సమీక్షిస్తున్నారు.