కాకతీయ విశ్వవిద్యాలయ పరీక్షలు వాయిదా
HNK: హన్మకొండ నగరంలో ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి శుక్రవారం ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.