చికిత్స పొందుతూ గుర్తుతెలియ వ్యక్తి మృతి
SRD: ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై సోమేశ్వరి తెలిపారు. ముని దేవునిపల్లి శివారులో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని 2వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ సోమవారం ఆ వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుని వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు.