'కార్పెంటర్ షాపులపై అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలి'

NLG: కార్పెంటర్ షాపులపై అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని CITU జిల్లా సహాయ అధికారి దండంపల్లి సత్తయ్య, పట్టణ అధ్యక్షుడు సలివోజు సైదాచారి కోరారు. టీజీ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాణికి ఈరోజు వినతి పత్రం అందజేశారు. కార్పెంటర్ షాపులో వేప, తుమ్మ కలప ఉండవద్దని అధికారులు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.