ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా ఆర్టీసీ బస్టాండ్

GNTR: తాడికొండలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాటా మ్యాజిక్ వాహనాలు, ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు బస్టాండ్‌లో నిలపడం వల్ల ఆర్టీసీ బస్సులు లోపలికి రాలేకపోతున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే తాడికొండలో బస్టాండ్ ఉందనే విషయం కూడా మర్చిపోయేలా ఉందని మంగళవారం స్థానికులు వాపోతున్నారు.