అంబేద్కర్‌కు విద్యుత్ ఉద్యోగుల నివాళి
BDK: డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రతిఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె.రమేష్, వరీకుటి శ్రీనివాసరావు ఉన్నారు.