అభివృద్ధి పనులపై కమిషనర్ పర్యటన
VZM: బొబ్బిలి పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి, పారిశుధ్య పనులను కమిషనర్ ఎల్. రామలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, పబ్లిక్ హెల్త్ మేస్త్రీలు, వార్డు శానిటేషన్ సెక్రటరీలతో కలిసి గాంధీ బొమ్మ, ఆరి గంగయ్య షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ ప్రాంతాలను ఆమె సందర్శించారు. గాంధీ బొమ్మ వద్ద పైపులైన్ మరమ్మత్తులు త్వరగా పూర్తి చేసి తాగునీరు అందించాలని తెలిపారు.