ఈ నెల 25 నుంచి రామాలయ ఉత్సవాలు
MDK: తూప్రాన్ పట్టణంలోని పురాతన రామాలయ ఉత్సవాలు ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. సోమవారం రామాలయం వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ రజని రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, పూజారి ఆత్రేయ శర్మ ఉత్సవాలను నిర్ణయించారు. 25న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభించి, 3న రథోత్సవం, చక్రస్నానంతో ఉత్సవాలు ముగిస్తున్నట్లు తెలిపారు,