కాల్పుల కలకలం.. ఒకరు మృతి

కాల్పుల కలకలం.. ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలోని దాబా వద్ద మంగళవారం సాయంత్రం యూపీకి చెందిన సల్మాన్ లారీని నిలిపాడు. కొద్దిసేపటికి మరో లారీలో వచ్చిన ఇద్దరు అతడిపై తుపాకీతో దాడి చేసి కాల్పులు జరపగా సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దుండగులు చంద్రాయన్‌పల్లి వద్ద లారీని వదిలేసి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.