ఆస్తి కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు
SRD: జహీరాబాద్‌లో ఆస్తి తగాదాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భరత్ నగర్‌లో నివసిస్తున్న తాజుద్దీన్(60)ను అతని భార్య, కుమారుడే దారుణంగా హతమార్చారు. బుధవారం గొడవ జరగగా, నిందితులు తాజుద్దీన్ కళ్లలో కారం చల్లి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.