నసురుల్లాబాద్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

నసురుల్లాబాద్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

KMR: నసురుల్లాబాద్ రామాలయ ప్రాంగణంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండల పరిధిలోని మహిళలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడంతో పోటీలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.