ఇండిగో సంక్షోభంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు
HYD: ఇండిగో సంక్షోభంపై సీపీఐ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విమానాల రద్దు, ఆలస్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కేంద్రమే కారణమని ఆరోపించారు. ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రజలను, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని విమర్శించారు. అందుకే వెంటనే ఇండిగోను కేంద్రం అధీనంలోకి తీసుకొని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.