అక్షయ తృతీయ.. విత్తనమే బంగారం వారికి

ADB: అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదంటారు. కానీ ముథోల్ నియోజకవర్గ రైతులకు మాత్రం విత్తనాలే బంగారం. శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా భైంసాలోని విత్తన విక్రయ దుకాణాలు రైతులతో కిటకిటలాడాయి. వానాకాలం సాగు కోసం ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని నియోజకవర్గ రైతులు భావిస్తారు. ఈ మేరకు చాలామంది రైతులు పత్తి, సోయా విత్తనాలు కొనుగోలు చేశారు.