వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే బూర్ల ఫైర్
GNTR: వైసీపీ ప్రభుత్వం ఒక్క భవనం కూడా నిర్మించలేకపోయిందని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులోని ఓ సంక్షేమ హాస్టల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఈ హాస్టల్ భవన నిర్మాణానికి కూడా మాజీ సీఎం జగన్ ఒక ఇటుక కూడా ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.