జనాభా గణన శిక్షణను వాయిదా వేయాలని వినతి
JGL: జనాభా గణన శిక్షణా తరగతులను ఈ నెల25వ తేదీ నుంచి నిర్వహించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా శాఖ కలెక్టర్ కార్యాలయంను కోరింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్, ప్రధాన కార్యదర్శి పాలేపు శివరామకృష్ణ వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ప్రస్తుతం పాఠశాల పరీక్షలు, స్పాట్ వాల్యుయేషన్ విధుల్లో ఉన్నందున శిక్షణను వాయిదా వేయాలని సూచించారు.