వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది: ఖర్గే
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు చేశారు. దేశంలో చమురు నిల్వలు ఉన్నాయని కేంద్రం చెప్తోందని.. కానీ, పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. 'ఇంధన కొరత వ్యవసాయం, ఎరువుల సరఫరాను దెబ్బతీసింది. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. గృహ సిలిండర్ల కోసం 25 రోజుల వరకు చూడాల్సి వస్తోంది. రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతోంది' అని మండిపడ్డారు.