బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: SP
ADB: ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రాథోడ్ విలాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ బాధిత కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. పోలీసులు ముఖ్య కార్యాలయం నుంచి కార్పస్ ఫండ్ కింద వచ్చిన లక్ష రూపాయల చెక్కును వారికి అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా SP కల్పించారు.