జిల్లాలో పేకాట రాయుళ్లు అరెస్ట్..!
WG: నరసాపురం టౌన్‌లోని వీవర్స్ కాలనీ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం సాయంత్రం టౌన్ ఎస్సై ముత్యాలరావు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ. 5,000, 52 పేకాట ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.