వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు బుధవారం విజయవాడ వాస్తవ్యులు కామినేని రాజా శ్రీనివాస్ నాగమణి దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ ఈవో చక్రధరరావుకు అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.