నేడు విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన
AP: విశాఖలో ఇవాళ మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. భోగాపురంలో GMR మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ (AAD) ఎడ్యుసిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. భవిష్యత్‌లో దేశానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తోంది.