'రైతు సంఘం మహాసభలకు తరలిరావాలి'

'రైతు సంఘం మహాసభలకు తరలిరావాలి'

MNCL: రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంలో రైతు సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో రైతు సంఘం మహాసభలు జరుగుతాయన్నారు. ఆ మహాసభలకు రైతులు, నాయకులు తరలిరావాలన్నారు.